టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది యాంకర్లు మాత్రమే సక్సెస్ఫుల్ గా వారి కెరీర్ కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. అనసూయ జబర్దస్త్ షోలో యాంకర్ గా మంచి గుర్తింపు అందుకుంది. ఈ షోలో ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు అనసూయ సినిమాలలో అవకాశాలను వెతుకుంది. రంగస్థలం సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 


సినిమా అనంతరం అనసూయకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఈ చిన్నది ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఎప్పటికప్పుడు అనసూయ ఏదో ఒక సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే అనసూయ మరోసారి వేశ్య పాత్రలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇదివరకే విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక మరోసారి అనసూయ వేశ్య పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారట.


ఈ విషయం తెలిసి అనసూయ అభిమానులు మంచి మంచి సినిమాలలో అవకాశాలు వస్తున్న సమయంలో ఇలా వేశ్య పాత్రలో నటించి కెరీర్ నువ్వు మరోసారి నాశనం చేసుకోవడం అవసరమా అంటూ తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్తల పైన అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.


తనకు తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. హాట్ గా ఫోటోలు తీసుకో అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అనసూయక సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: