
దీనికితోడు ఈమూవీతో పోటీగా విడుదలైన తమన్నా ‘ఓదెల 2’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో కళ్యాణ్ కు పరిస్థితులు అన్నీ కలిసి వచ్చి గతవారం విజేతగా మారాడు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈమూవీ మరో రెండు రోజులలో బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అంటున్నారు.
ఇక ఈసినిమా చూసిన సగటు ప్రేక్షకుడు ఈసినిమా చివర వచ్చే 20 నిముషాల క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కమర్షియల్ హీరోల క్లైమాక్స్ కు భిన్నంగా ఈసినిమా క్లైమాక్స్ ఉండటంతో కళ్యాణ్ రామ్ చేసిన సాహసం పై ప్రశంసలు వస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి క్లైమాక్స్ ఈమూవీలో పెట్టె విషయంలో చాల ఆలోచనలు జరిగాయట. ఈమూవీ దర్శకుడుకి కళ్యాణ్ రామ్ పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో ఈమూవీ క్లైమాక్స్ బాగా వచ్చింది అని అంటున్నారు.
‘బింబిసార’ తరువాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారడంతో కళ్యాణ్ రామ్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఈ నందమూరి హీరో ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ పూర్తి కమర్షియల్ హీరోగా మారలేకపోతున్నాడు. నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన సినిమాలు కూడ చెప్పుకోతగ్గ ఘన విజయాన్ని సాధించలేకపోయాయి. దీనితో కళ్యాణ్ రామ్ కెరియర్ ఒక అడుగు ముందుకు పడితే మరో నాలుగడుగులు వెనక్కు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటారు..