టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. ఈ హీరో కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన మహేష్ బాబు తెలుగు అభిమానులను అలరించాడు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు తక్కువ సమయంలోనే సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగించాడు. ఇక మహేష్ బాబు వయసు పెరిగినప్పటికీ చాలా హాండ్సమ్ గా కనిపిస్తాడు. 

మహేష్ బాబు అందానికి ప్రతి అమ్మాయి ఫిదా అవుతుంది. మహేష్ బాబు మంచి ఫిట్నెస్ తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో రెండు సంవత్సరాలలో థియేటర్లలో రిలీజ్ కాబోతుందని ఓ వార్త వైరల్ అవుతుంది. కాగా మహేష్ బాబు ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ షూటింగ్ లలో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇక మహేష్ బాబు సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తాడు.

 అదేవిధంగా ఒక్కో యాడ్ చేసినందుకు దాదాపు ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తారట. మహేష్ బాబు ఒక్కో సినిమాలో నటించినందుకు 70 నుంచి 80 కోట్ల పారితోషకం తీసుకుంటారని సమాచారం అందుతుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో ఒక యాడ్ ప్రమోట్ చేసినందుకు కోట్లలో చార్జ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ మహేష్ బాబుకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: