నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరస పెట్టి విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. నాని ఆఖరుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో నాని కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ ద్వారా నాని , ప్రియాంక అరుల్ మోహన్ లకు మంచి గుర్తింపు లభించింది.

తాజాగా నాని "హిట్ 3" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నాని వరుస పెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా నాని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా నాని "హిట్ 3" మూవీ కి ఓల్డ్ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పని చేసింది. ఆమె మరెవరు కాదు హిట్ 3 మూవీ హీరోయిన్ శ్రీ నిధి శెట్టి అని చెప్పుకొచ్చాడు. శ్రీ నిధి శెట్టి వరుసగా కే జీ ఎఫ్ చాప్టర్ 1 , కే జీ ఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో మంచి విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.

ఆ తర్వాత ఈమె కోబ్రా అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ ముద్దుగుమ్మ హిట్ 3 మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే ఈ బ్యూటీ కి తెలుగులో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శ్రీ నిధి శెట్టి  , సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: