‘బింబిసార’ పార్ట్ వన్ తీసిన వశిష్ట తో ఈ సీక్వెల్ తీయాలని ప్రాయత్నాలు చేసినప్పటికీ ఆ దర్శకుడు చిరంజీవితో ‘విశ్వంభర’ మూవీ చేస్తూ ఉండటంతో కళ్యాణ్ రామ్ ఆశలు నెరవేరలేదు. వాస్తవానికి లేటెస్ట్ గా విడుదలైన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ అంచనాల ప్రకారం సక్సస్ అయితే ‘బింబిసార 2’ ను వెంటనే ప్రకటిద్దామని భావించాడు అని అంటారు.
అయితే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మొదటిరోజు 5 కోట్ల కలక్షన్స్ రాబట్టి ఆతరువాత నుండి కలక్షన్స్ బాగా డ్రాప్ అవ్వడంతో ఈసినిమాకు పెట్టిన పెట్టుబడిలో 50శాతం కూడ రికవరీ కాలేదు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో తన అంచనాలు తప్పాయని కళ్యాణ్ రామ్ షాక్ లో ఉన్నట్లు టాక్. రొటీన్ కమర్షియల్ సినిమాకు మదర్ సెంటిమెంట్ కలిస్తే ఆమూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న అతడి అంచనాలు మారిపోవడంతో కళ్యాణ్ రామ్ తన ‘బింబిసార 2’ ప్రాజెక్ట్ ను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో నిర్మాణంలో ఉన్న మూవీకి భాగస్వామిగా ఉంటూ ఆమూవీ నిర్మాణ పనులను చాల చురుకుగా నిర్వహిస్తున్నాడు. ఈమూవీ విడుదల తరువాత ఈ నందమూరి హీరో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బింబిసార 2’ గురించి ఆలోచించే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి అయోమయంగా మారడంతో రానున్న రోజులలో మీడియం రేంజ్ చిన్న సినిమాలను తీసే సాహసం చాలామంది చేయకపోవచ్చు అన్న విశ్లేషణలు కూడ వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి