కానీ ఆ తర్వాత రానా హీరోగా కన్నా విలన్ గానే మూవీస్ చూస్ చేసుకుంటూ వచ్చాడు . ఆశ్చర్యం ఏంటంటే రానా క్యారెక్టర్ హీరోగా కన్నా కూడా విలన్ గానే బాగా సూట్ అయింది అని జనాలు ఆయన ని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు . ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ విలన్ గా నటించి మెప్పించారు. మరీ ముఖ్యంగా రానా విలన్ గా నటించిన భీమ్లా నాయక్ సినిమా ..అదేవిధంగా బాహుబలి సినిమా ఎప్పటికీ మర్చిపోలేనిది . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ కి ఎంత హై రేంజ్ సీన్స్ ఉన్నాయో రానా దగ్గుబాటికి కూడా అంతే హై లెవల్ సీన్స్ ఉన్నాయి .
ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే రానా దగ్గుబాటి నటనే ఒక మెట్టు ఎక్కువగా ఉంది అంటూ అప్పుడు రివ్యూవర్స్ చెప్పుకొచ్చారు . అయితే మరొకసారి ఈ కాంబో రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ "స్పిరిట్" అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించబోతున్నారట. సందీప్ రెడ్డి వంగ హీరో క్యారెక్టర్ ఎంత హైలెట్గా రాసుకుంటాడో విలన్ క్యారెక్టర్ అంతకంటే డబల్ రేంజ్ హై గా రాసుకుంటూ ఉంటాడు. మరి అలాంటి సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రానా దగ్గుబాటి విలన్ క్యారెక్టర్ అంటే మాత్రం కచ్చితంగా బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ రానా - ప్రభాస్ ల పేర్లు వైరల్ అయ్యేలా చేస్తుంది..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి