టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి యాంకరింగ్ స్టైల్, అంద చందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ తనదైన హోస్టింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ షోలలో అవకాశాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ యాంకర్ గా తన కెరీర్ ను కొనసాగించింది. ఇక అనసూయ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో అవకాశాలను అందుకుంది.


అనేక సినిమాలలో నటించిన ఈ చిన్నది రంగస్థలం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత అనసూయకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక అనసూయ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనసూయ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇక అనసూయ "కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్" అనే షోలలో జడ్జిగా కొనసాగుతున్నారు. అందులో అనసూయతో పాటు శేఖర్ మాస్టర్ కూడా ఉండడం విశేషం. వీరిద్దరి మధ్య షోలో విపరీతంగా కాంపిటీషన్ కొనసాగుతూ ఉంటుంది. ఈ సమయంలోనే అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ తో కలిసి ఫోటోలను దిగారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి.

 ఈ ఫోటోలలో అనసూయ, శేఖర్ మాస్టర్ చేతును పట్టుకొని తన భుజంపై తలపెట్టి ఫోటోలు ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నారు. భర్త పిల్లలు ఉండగా ఇలా మరొక వ్యక్తితో ఇంత క్లోజ్ గా ఫోటోలు దిగడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై అనసూయ భరద్వాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: