తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి నటిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాశి కన్నా ఒకరు. ఈమె నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా రాశి ఖన్నా కు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు చాలా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన అనేక తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమెకు మంచి నటిగా గుర్తింపు కూడా లభించింది.

తెలుగు సినీ పరిశ్రమలో ఈమెకు అద్భుతమైన గుర్తింపు ఉన్న కూడా ఈమె తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా ప్రస్తుతం తమిళ్ , హిందీ సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. ఈమె ఆఖరుగా తెలుగులో పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ వచ్చి చాలా కాలమే అవుతున్న ఈ సినిమా తర్వాత ఈమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈమె కేవలం సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా అనే తెలుగు సినిమాలో మాత్రమే హీరోయిన్గా నటిస్తోంది.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగి ఉన్న సమయం లోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాల్లో నటించడం పై ఆసక్తిని చూపించింది. ప్రస్తుతం రాశి కన్నా కూడా రకుల్ రూట్లోనే పయనిస్తున్నట్లు ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఏదేమైనా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాశి కన్నా , రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరికి కూడా మంచి క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk