టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించాడు. బాలకృష్ణమూవీ లో ఒక పాత్రలో అఘోరాగా నటించగా ... మరో పాత్రలో రైతుగా నటించాడు. ఈ రెండు పాత్రలలో కూడా తనదైన శైలిలో వేరియేషన్స్ చూపెట్టి తన నటనతో బాలకృష్ణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ సక్సెస్ కావడం , ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకోగడంతో ఈ మూవీ విడుదల అయిన కొంత కాలానికి ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 మూవీ ని రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అఖండ 2 మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... మరికొన్ని రోజుల్లో ఈ మూవీ యూనిట్ ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సన్నాహాలను చేస్తున్నట్లు , ఈ యాక్షన్ సన్నివేశంలో బాలకృష్ణ తో సహా ఏకంగా 1000 మంది ఫైటర్స్ పాల్గొనబోతున్నట్లు , ఈ ఫైట్ ను అత్యంత భారీ బడ్జెట్ తో , ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫైట్ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అఖండ 2 మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: