ఈ మధ్యకాలంలో ఇది మనం కామన్ గా చూస్తూనే ఉన్నాము. ఒకప్పుడు స్టార్స్ నటించిన సినిమాలను రీమేక్ చేస్తూ ఉండడం. స్టార్స్ నటించి సూపర్ డూపర్ హిట్ అందుకున్న సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉండడం.. అదేవిధంగా స్టార్ నటించిన పాటలను మరొకసారి రీమేక్ చేస్తూ తెరపై చూపిస్తూ ఉండడం ఎక్కువగా చూస్తున్నాము.  కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఆల్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీయర్ లో చేసిన అన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అడపాదడపా సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా మ్యూజికల్ పరంగా హిట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్ని సినిమాలలోకి అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ గా నిలిచే సినిమా "ఇంద్ర". ఈ సినిమాను ఎన్ని సార్లు చూసిన తనవి తీరదు . చూసే కొద్ది ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . ఈ సినిమాలోని పాటలు కూడా అంతే ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. .



మరీ ముఖ్యంగా "దాయి దాయి దామ సాంగ్" వేరే లెవెల్ అనే చెప్పాలి . దాయి దాయి దామ స్టెప్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది . అయితే ఈ పాటని మళ్లీ రీమేక్ చేయబోతున్నాడు చరణ్ అన్న వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోని "దాయి దాయి దామ" సాంగ్ రామ్ చరణ్ ..సుకుమార్ సినిమా కోసం రీమేక్  చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారట . ఆల్రెడీ చిరంజీవి సాంగ్స్ ను చరణ్ రీమిక్స్ చేశారు . బంగారు కోడి పెట్ట.. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో ..ఇలాంటి సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి ఈ దాయి దాయి దామ  పాట రాబోతుంది అంటున్నారు జనాలు . ఈ పాట థియేటర్లో మరొకసారి చూస్తే అది కూడా చరణ్ ఆ స్టెప్ వేస్తే మెగా ఫాన్స్ ని ని ఆపగలమా..? రచ్చ రంబోల చేసేస్తారు. ఆ మూమెంట్ కోసం వెయిటింగ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: