కేవలం కొద్ది గంటలే.. మరి కొద్ది గంటల్లోనే తారక్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.  తారక్ పుట్టినరోజును తారక్ కన్నా కూడా నందమూరి ఫ్యాన్స్ ఇంకా ఇంకా హైలైట్ గా జరుపుకుంటూ ఉంటారు.  ప్రతి సంవత్సరం కూడా ఎంత హంగామా చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అర్థరాత్రి 12 గంటలు దాటగానే భారీ కేక్ కట్ చేయడం .. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ కటౌట్లు ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం.. ఆ కటౌట్ లకి పాలాభిషేకాలు పూలదండలు వేసి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ అరవడం మనం కామన్ గానే చూస్తూ ఉంటాం .

అయితే ఈసారి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూసింత డిసప్పాయింట్మెంట్ తప్పనే తప్పదు అని అర్థమైపోయింది . ఎన్టీఆర్ 31 సినిమా అప్డేట్ వస్తుంది అని ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ లాస్ట్ లో ఇది క్యాన్సిల్ అయింది అంటూ తెలుస్తుంది . టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ఎన్టీఆర్ 31 నుంచి రావాల్సిన అప్డేట్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ నందమూరి ఫ్రాన్స్ కు డీప్ గా హర్ట్ చేస్తుంది . అయితే ఇదే మూమెంట్లో మరొక వార్త కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను బాధపెడుతుంది. మనకు తెలిసిందే చాలా మంది స్టార్స్ పాత సినిమాలలో సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు రీమేక్ చేస్తూ ఉంటారు .

అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాలో ఒక సాంగ్ రీమేక్ చేయాలనుకున్నారట . అది కూడా బాలయ్య కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన "లక్స్ పాప" సాంగ్ . అయితే ఆ టైంలో ఎన్టీఆర్ - బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ లో ఉండింది.  ఎన్టీఆర్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అంటూ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యాన్స్ దూరం పెట్టాలి అంటే కొంతమంది ఘాటుగా స్పందించారు.  అంతే కాదు కొంతమంది అసలు నీకు నందమూరి ఫ్యామిలీతో సంబంధం లేదు అని.. బాలయ్య పాటని రీమేక్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ చేస్తామని ఇంకొంతమంది ఘాటుగా తాట తీసేస్తామని దారుణాతి దారుణంగా ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి మరి ట్రోల్ చేశారు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా చాలా కూల్ గా ఉన్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కి ఆ పాట రీమేక్  చేసే ఆలోచన లేదట . కేవలం డైరెక్టర్ అభిప్రాయం మాత్రమే అది.  కానీ ఇంత రచ్చ రంబోలా జరిగాక ఏ డైరెక్టర్ కూడా పాటని రీమేక్  చేయడానికి సాహసం చేయట. ఆ డైరెక్టర్ కూడా సైలెంట్ గా ఆ పాటను వదిలేసుకున్నారు . ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎవరైతే ఎన్టీఆర్ ని టార్గెట్ చేసారో వాళ్ళందరూ నోరు మూసుకునేలా చేసాడు తారక్మ. రికొద్ది గంటల్లో తారక్ బర్త డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అనగా మరొకసారి ఈ వార్త వైరల్ అవుతూ ఉండడం పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన విధంగా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: