టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ ప్రధాన పాత్రలలో భైరవం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. విజయ్ కనకమెడల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి గరుడన్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. భైరవం సినిమాలో ముగ్గురు హీరోలు ఉండడం , అలాగే ఈ మూవీ ని అత్యంత గ్రాండ్ గా రూపొందించడంతో ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం భైరవం సినిమాకు ఏకంగా 50 కోట్ల రేంజ్ లో ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

భైరవం మూవీ ఒరిజినల్ వర్షన్ అయినటువంటి గరుడన్ మూవీ అద్భుతమైన విజయం సాధించిన కూడా ఆ సినిమాకు టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి కేవలం 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసినట్లయితే ఆ మూవీ కి మొత్తంగా వచ్చిన కలెక్షన్లకు దగ్గరగా  మూవీ కి ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. మరి భైరవం మూవీ పై ప్రస్తుతం మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకున్నట్లైతే ఈ మూవీ పెద్ద ఎత్తున కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది. అదే భైరవం సినిమాకు కనుక మంచి టాక్ రానట్లయితే ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం కాస్త కష్టం అయ్యే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి నాన్ ధియేటర్ హక్కుల ద్వారా మంచి బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి నాన్ ధియేటర్ హక్కుల ద్వారానే ఏకంగా 32 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఇకపోతే భైరవం సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: