మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దశకత్వంలో ` పెద్ది` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయిక కాగా.. జగపతిబాబు, శివ రాజ్ కుమార్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో పెద్ది మూవీని నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతుంది. నగర శివార్లలో గ్రామీణ వాతావరణాన్ని తలపించే సెట్ వేసి షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముప్పై శాతం చిత్రీకరణ కంప్లీట్ అయింది. ఇటీవల బ‌ట‌య‌కు వ‌చ్చిన గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలను తారా స్థాయిలో పెంచేసింది. ఇదిలా ఉండగా తాజాగా పెద్ది సినిమా పై ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


ఇంతకీ విషయం ఏంటంటే.. పెద్ది రెండు భాగాలుగా రాబోతోందట. ఒక కథను రెండు ముక్కలుగా చేసి చెప్పడం బాహుబలి తో ప్రారంభం అయింది. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోల చిత్రాలు రెండు పాటలుగా వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అదే బాటలో వెళ్ళబోతున్నారని.. పెద్ది చిత్రాన్ని రెండు పార్టీలుగా ప్లాన్ చేస్తున్నారని వార్త‌లు స‌ర్క్యూలేట్ అవుతున్నారు. అయితే ఈ వార్త‌లు ఎంతవరకు నిజమ‌న్న‌ది స్పష్టత లేదు. ఒకవేళ నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: