
అయితే తాజాగా తొలిసారి బాడీ షేమింగ్‌పై ఐశ్వర్యరాయ్ నోరు విప్పింది. నేను బరువు పెరిగితే మీకేంట్రా నొప్పి అంటూ ఆమె ఫైర్ అయింది. `నేను వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మీకేంటి సమస్య? నా కూతురు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగానా? లేక ఒంట్లో నీరు నిలిచిందా? అనే దానిపై మీకెందుకు అంత ఆసక్తి?` అని ఐశ్వర్య రాయ్ బచ్చన్ సూటిగా ప్రశ్నించింది.
`నేను కోరుకుంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోగలను. కానీ నాకు ఆ అవసరం లేదు. నా శరీర బరువు నాకెప్పుడూ ఆందోళన కలిగించలేదు. ప్రస్తుతం నేను నా కుమార్తెపై దృష్టి సారించడంలో చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నాను. ఇక ఇతరులు ఏమి అనుకున్నా, అది నన్ను బాధించదు` అంటూ ఐష్ తేల్చి చెప్పింది. మొత్తంగా బాడీ షేమింగ్ చేసేవారికి ఐశ్వర్యరాయ్ లెఫ్ట్ అంట్ రైట్ ఇచ్చిపడేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు