దగ్గుబాటి రానా పెళ్లికి ముందు బిపాసా బసూ, త్రిష వంటి హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నట్టు ఎన్నో రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా బిపాసా బసూతో దగ్గుబాటి రానా ప్రేమయాయణం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక బిపాసా బసూ ని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో హైదరాబాద్ కి తీసుకువచ్చి తన ఇల్లు తన ఆస్తిపాస్తులు అన్ని చూపించినట్టు కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.కానీ సడన్గా బిపాసాతో నాకు ఉన్న పరిచయం కేవలం స్నేహం మాత్రమేనని,ప్రేమ లాంటిది ఏమీ లేదు అని ఈ వార్తలను కొట్టి పారేశారు.ఇక హీరోయిన్ త్రిషతో కూడా రానా డేటింగ్ లో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని రూమర్లు వినిపించాయి.ముఖ్యంగా రానా, త్రిష కలిసి ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఇది నిజమేనా అని అందరూ భావించారు.

అయితే ఈ ఫోటోలు కేవలం ఫ్రెండ్లీగా తీసుకున్నవి మాత్రమే అని వీళ్ళిద్దరూ చెప్పినప్పటికీ, ఫ్రెండ్లీగా అయితే ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని దిగొచ్చు కానీ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుని దిగాకూడదు కదా.. ఇద్దరి మధ్య ఏదో ఉంటేనే అలాంటి ఫోటోలు దిగుతారు ఆ మాత్రం అర్థం కాదా అంటూ చాలామంది జనాలు వీరి ఫోటోలపై నెగటివ్ కామెంట్లు పెట్టారు.ఈ విషయం పక్కన పెడితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రానా త్రిష తో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ త్రిషతో నాకు మంచి స్నేహం ఉంది. మా మధ్య వేరే రిలేషన్ అయితే లేదు అని చెప్పారు.అయితే ఓ ఇంటర్వ్యూలో త్రిష రానా ఇద్దరు పాల్గొన్నారు.అయితే అదే ఇంటర్వ్యూలో యాంకర్ దగ్గుబాటి రానా ని ఒకవేళ మిమ్మల్ని చెన్నైలో వదిలేసి వస్తే వెళ్తారా ఎక్కడికి వెళ్తారు అని అడిగింది.

ఎందుకు నాకు చెన్నై తెలియదు అనుకుంటున్నారా.. నాకు చెన్నై తెలుసు. వెళ్తాను.. నాకేం భయం అన్నట్లుగా రానా ఆన్సర్ ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు అని యాంకర్ అడగగా.. నాకు చెన్నైలో తెలిసింది ఒకే ఒక్కరి ఇల్లు..అది త్రిష దే.. నేను అర్ధరాత్రి వదిలిపెట్టినా కూడా త్రిష ఇంటికే వెళ్తాను అంటూ ఆన్సర్ ఇవ్వడంతో అదే ఇంటర్వ్యూలో ఉన్న త్రిష సిగ్గుపడుతూ నవ్వింది.అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది పెళ్లికి ముందు వీరి ప్రేమ గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు. అయితే రానా మాట్లాడిన ఈ మాటలు ఆయన పెళ్లి కాకముందువి. ఇక ఆయన కరోనా సమయంలో మిహికా బజాజ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: