శృతిహాసన్ డేటింగ్స్, ఎఫైర్స్ అంటూ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే శృతిహాసన్ గురించి తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే శృతిహాసన్ ఇకపై నో డేటింగ్స్ ఓన్లీ పెళ్లే అంటుందట.అయితే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతున్నట్టు తమిళ సినీ వర్గాల నుండి ఒక వార్త వినిపించడంతో చాలామంది శృతిహాసన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఇంతకీ శృతిహాసన్  ని పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తండ్రి పేరు ఎక్కడా కూడా వాడుకొని సినిమాల్లో అవకాశాలు అందుకోకుండా తన సొంత టాలెంట్ తోనే ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి గబ్బర్ సింగ్ మూవీ తో సక్సెస్ కొట్టేసింది.. శృతిహాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాకుండా సింగర్ గా కూడా తన సత్తా చాటింది.

అలాంటి శృతిహాసన్ తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ గా రాణించి ముఖ్యంగా ఫ్లాప్ లో ఉన్న హీరోలకి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. అలా ఎంతోమంది ఫ్లాపుల్లో ఉన్న హీరోలు శృతిహాసన్ తో నటిస్తే హిట్స్ వస్తాయి అనే సెంటిమెంట్ ఒకటి ఇండస్ట్రీలో ఉంది.ఇక ప్రస్తుతం శృతిహాసన్ రజినీకాంత్ కూలి మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే అడివి శేష్ డెకాయిట్ మూవీలో మొదట శృతిహాసన్ నటించినప్పటికీ ఆ తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా నుండి శృతి తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ చేస్తుంది. ఇక శృతిహాసన్ సినిమాల విషయం కాస్త పక్కన పెడితే.. శృతిహాసన్ గత ఏడాది ప్రియుడు శాంతాను హాజరికతో బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వినిపించాయి.

అలాగే ఈ వార్తలకు తగ్గట్టుగానే బ్రేకప్ జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రియుడితో కలిసి కనిపించకపోవడంతో శృతిహాసన్ బ్రేకప్ నిజమేనని అందరూ అనుకున్నారు.అయితే శృతిహాసన్ సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్ వార్తలతోనే కోలీవుడ్లో వైరల్ అయింది.దీంతో శృతిహాసన్ పై ఒక నెగిటివ్ ముద్ర కూడా ఉంది. అయితే తాజాగా శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందట. అదేంటంటే ఇక నో డేటింగ్ డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవాలి ఇప్పటినుండి ఎవరితో డేటింగ్ చేయకూడదు అని  నచ్చితే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు శృతిహాసన్ సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.ఇక గత కొద్ది రోజుల నుండి ఓ తమిళ డైరెక్టర్ తో శృతిహాసన్ ప్రేమలో ఉందని ఆ డైరెక్టర్ కి ఇప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని, త్వరలోనే ఆ డైరెక్టర్ శృతిహాసన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: