- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్‌లో థియేట‌ర్ల బంద్ విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చి ఎంత పెద్ద ర‌చ్చ‌గా మారిందో చూశాం. సింగిల్ స్క్రీన్ల లోనూ ప‌ర్సంటేజ్ సిస్ట‌మ్ అమ‌లు చేయాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు.. ఎగ్జిబిట‌ర్లు కోరుతున్నారు. అయితే పెద్ద సినిమాల నిర్మాత‌లు మాత్రం సింగిల్ స్క్రీన్ల‌లో రెంట్ సిస్ట‌మ్ మాత్ర‌మే అమ‌లు చేస్తామ‌ని చెపుతున్నారు. చివ‌ర‌కు ఇది హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్‌కు చుట్టు కోవ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫైర్ అవ్వ‌డం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు .. కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని అంటున్నారు.


ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ప్ర‌తి ఒక్క‌రు ఆలోచించాలి. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయన‌డంలో సందేహం లేదు. ఇక ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. పెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు.


 ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే   ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్ర‌మే ఉంటాయి. అప్పుడు పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది. చిన్న హీరోలు.. మిడిల్ రేంజ్ హీరోలు ఓటీటీ సినిమాలు చేసుకుని కాలం గ‌డుపుతారు. అప్పుడు న‌ష్ట‌పోయేది పెద్ద హీరోలు మాత్ర‌మే... వాళ్ల సినిమాలు ఆడేందుకు సింగిల్ స్క్రీన్లు ఉండ‌వు... బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కులు క‌రువై పోతారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: