ఏంటి సీనియర్ ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్ అలా మాట్లాడారా..నిజంగానే ఏఎన్ఆర్ ఆస్తి కొట్టేయాలని ఎన్టీఆర్ అనుకున్నారా.. ఇంతకీ సీనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ టాలీవుడ్ కి రెండు మూల స్తంభాల వంటి వారని,రెండు కళ్లలాంటి వారని అంటూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత మంచి పొజిషన్లో ఉందంటే దానికి కారణం వీళ్లిద్దరే అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహంతో పాటు వీరి కాంబోలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. వీరిద్దరూ దిగ్గజ స్టార్లు అయినా కూడా వీరిద్దరి మధ్య సినిమాలు వచ్చాయంటే అప్పట్లో అభిమానులు ఎలా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి స్నేహబంధం మధ్యలో కట్ అయిన సంగతి మనకు తెలిసిందే. 

గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ల మధ్య నిప్పు ఉప్పు లాంటి బంధం ఉండేది.ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఏఎన్ఆర్ ఆస్తి మీద కన్నేసారట. అదేంటంటే ఏఎన్ఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అలాగే తెలుగు రాష్ట్రాలు వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో అన్నపూర్ణ స్టూడియోని నిర్మించారు. అయితే ఈ అన్నపూర్ణ స్టూడియో పై సీనియర్ ఎన్టీఆర్ కన్నేసారట. ఎలాగైనా స్టూడియోని దక్కించుకోవాలని అనుకున్నాడట.. అయితే అప్పుడే ఆయన గురించి అసలు నిజం తెలిసింది.ఏఎన్నార్ అప్పటినుండి ఎన్టీఆర్  పై కోపం పెంచుకున్నారట.అంతేకాదు అప్పట్లో సీఎం అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో వైరం ఉన్నా కూడా ఏం బ్రదర్ ఎలా ఉన్నారు.. మరదలు గారు ఎలా ఉన్నారు.. నాగార్జున బాగున్నాడా అని అడిగేవాడట. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి నలుగురిలో మర్యాదగా ఉండాలని.కానీ ఏఎన్నార్ మాత్రం దూరం పెడుతూ వచ్చారట.ఇక సీనియర్ ఎన్టీఆర్ రెండోసారి సీఎం అయినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీ నుండి చాలామంది పెద్దలు వెళ్లారట.

కానీ ఏఎన్నార్ ని రమ్మంటే మాత్రం నేను రాను. నాకు రావాలని లేదు అని చెప్పండి.అడిగినా కూడా మీ మీద ఏఎన్నార్ కోపంగా ఉన్నారని చెప్పండని అన్నారట. ఆ తర్వాత చెన్నారెడ్డి సీఎం అయినప్పుడు సుప్రీంకోర్టులో కేసు గెలిచి అన్నపూర్ణ స్టూడియోని దక్కించుకున్నారు ఏఎన్ఆర్. ఒకవేళ ఎన్టీఆర్ సీఎంగా ఉండి ఉంటే నన్ను కొర్టు దాకా కూడా వెళ్లనీచ్చేవాడు కాదని,ఆ కేసు గెలిచే వాడిని కాదని ఏఎన్ఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఆ తర్వాత రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా నన్ను ఇంటికి భోజనానికి పిలిచి మన మధ్య ఈ గొడవలన్నీ పక్కనపెట్టి ఇప్పటినుండి స్నేహంగా ఉందాం అని చెప్పారంటూ ఎన్టీఆర్ తో ఉన్న గొడవలు, అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు  ఏఎన్ఆర్.అయితే ఏఎన్ఆర్ మాట్లాడిన అప్పటి ఓల్డ్ వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: