
తాజాగా ఈ అమ్మడు డార్క్ బ్యాక్ డ్రాప్ లో ఫోటోలను షేర్ చేసింది. తన అందాలను రివిల్ చేస్తూ బికినీలో కనిపించింది. అంతేకాకుండా లూస్ బ్లేజర్ తో తన అందాలను కవర్ చేస్తూ చీకటిలో విభిన్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది దిశ పటాని. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. చీకట్లో దిశ పటాని చిందులు అంటూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదట లోఫర్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత ఎంఎస్ ధోని అనే సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది.
బాలీవుడ్లో నే కాకుండా తెలుగులు ,తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది. సినిమాలలో కూడా ఎలాంటి పాత్రలైనా చేయడానికి వెనకడుగు వేయదు ఈ ముద్దు గుమ్మ. గతంలో ప్రముఖ నటుడు టైగర్ శ్రాఫ్ తో కొన్నేళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయారనే విధంగా వార్తలు వినిపించాయి. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించేది. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్ తో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దిశా పటాని కి సంబంధించి ఎలాంటి విషయమైన క్షణాలలో సంచలనంగా మారుతోంది.