ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా తక్కు వ సినిమాలకే దర్శకత్వం వహించిన అందులో ఎక్కువ శాతం సినిమా  లతో అద్భుత మైన విజయాలను అందుకోవడంతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం లోకేష్ కనకరాజు సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ లో నాగార్జున కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే చాలా కాలం క్రితం లోకేష్ కనకరాజ్ , కార్తీ హీరోగా ఖైదీ అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి కొనసాగింపుగా ఖైదీ 2 సినిమాని మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ స్టార్ ఈమేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి అనుష్క , లోకేష్ కనకరాజ్ యూనివర్స్ మూవీలలో భాగం అయిన ఖైదీ 2 మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఈమె అదిరిపోయే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో పాజిటివ్ రోల్స్ చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ బ్యూటీ ఏకంగా లోకేష్ కనకరాజ్ లాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతుంది అని వార్తలు రావడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై బజ్ మరింతగా పెరిగిపోయింది. మరి నిజం గానే అనుష్క "ఖైదీ 2" మూవీ లో నటిస్తుందా ..? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: