ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం అదరగోట్టాయి. ఈ కాంబినేషన్లో మరో సినిమా ఏడాదిన్నర క్రితం ఫిక్స్ కాగా వేర్వేరు కారణాల వాళ్ళ ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పట్లో ఈ కాంబోలో సినిమా తెరకెక్కే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చింది.

నిర్మాత నాగవంశీ  సైతం బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చేసారు. అయితే  త్రివిక్రమ్ ను కాదని  మలయాళ  దర్శకుడికి  బన్నీ ఛాన్స్ ఇచ్చారని సమాచారం. మరో నాలుగు నెలల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.  కేవలం మూడంటే  మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకునికి బన్నీ ఛాన్స్ ఇచ్చారు.   బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో  బన్నీ సినిమా తెరకెక్కనుందని  తెలుస్తోంది.

బాసిల్ జోసెఫ్ దాదాపుగా నాలుగేళ్లు కష్టపడి  ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేశారని  సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి  త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.  అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ సైతం భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.  

బన్నీ త్రివిక్రమ్  కాంబో మూవీ ఇప్పుడు ఆగిపోయినా భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో  సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. అల్లు అర్జున్ రాబోయే  రోజులలో మరిన్ని సంచలన రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  బన్నీ ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తుండగా భవిష్యత్తు సినిమాలతో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాడో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ కెరియర్  ప్లానింగ్ ఊహలకు  అందని విధంగా ఉంటుందని  అభిమానులు  ఫీలవుతున్నారు.   అల్లు అర్జున్ పారితోషికం సైతం అంచనాలకు అందని స్థాయిలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: