టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మరో మంచి ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ నటించిన అవకాశం ఉందని చెప్తున్నారు. హరిహర వీరమల్లు - ఓజి సినిమాల షూటింగ్ పవన్ ఇప్పటికి పూర్తి చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డేట్లు కేటాయిస్తున్నారు. భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక పవన్ చేసే మంచి సినిమా ఏమిటి అన్నది ? ఇప్పుడు ఆసక్తిగా మారింది. సముద్రఖని దర్శకత్వంలో పవను మరోసారి నటిస్తారని చెబుతున్నారు. అలాగే ఎన్నో ఏళ్ల కిందట తాళ్లూరి రామ్ నిర్మాతగా ... సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకు పవన్ ఓకే చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమాను పూర్తిగా పక్కన పెట్టారు.
అయితే సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ లాంటి డిజాస్టర్ సినిమా తెరకెక్కించిన తర్వాత ఆయన పై టాలీవుడ్ లో చాలామందికి నమ్మకాలు పోయాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ కు ఆరేళ్ల కిందటే అడ్వాన్స్ ఇచ్చారు నిర్మాత్ రామ్ తాళ్లూరి. సురేందర్ రెడ్డి చెప్పిన మాఫియా కథ పవన్ కు విపరీతంగా నచ్చింది అన్నారు. మరి ఇన్నేళ్లకు పవన్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు .. చక చకా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు. మరి ఈ టైంలో అయినా సురేందర్ రెడ్డి సినిమా చేస్తారా ? లేదా ఈ డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా ఎందుకు అని సైలెంట్ అయిపోతారా అన్నది చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు