సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఏదో ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. అలా నాగార్జునకు కూడా ఒక సెంటిమెంట్ ఉందట.ఆదివారం రోజు ఆ పని అస్సలు చేయరట. అయితే నాగార్జునకి ఉన్న ఈ సెంటిమెంట్ ని శేఖర్ కమ్ముల బయట పెట్టారు.మరి ఇంతకీ నాగార్జునకీ ఉన్న ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర.. ఈ సినిమా జూన్ 20న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ మీద దర్శకుడు శేఖర్ కమ్ముల నాగార్జున గురించి మాట్లాడుతూ.. నేను నాగార్జున అమల కాంబోలో వచ్చిన శివ మూవీ షూటింగ్ సమయంలో ఆయన దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. 

అయితే నాగార్జున సినిమాల్లోకి వచ్చి ఇన్ని రోజులు అయ్యాక కూడా ఒక సెంటిమెంట్ బ్రేక్ చేయలేదు. కానీ నా కుబేర సినిమా కోసం తన సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు.నాగార్జున ఆదివారం షూటింగ్లో అస్సలు పాల్గొనరు. కానీ కుబేర సినిమా కోసం ఆయన తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మరీ ఆదివారం నాకోసం షూటింగ్ కి వచ్చారు. అలాగే నాగార్జున రాత్రిపూట కూడా షూటింగ్లో పాల్గొనరు. కానీ కుబేర సినిమా కోసం త్యాగం చేశారు. ఇక ధనుష్ ని చూసి షూటింగ్ సెట్ కి వచ్చిన మొదటి రోజు నాగార్జున అస్సలు గుర్తుపట్టలేదు.ఇదేంటి ఇలా మారిపోయాడు అనుకున్నారు. ఇక ధనుష్ డెడికేషన్ కి నేను ఫిదా అయిపోయాను.ఆయన ఉండడమే చాలా సన్నగా ఉంటారు.

కానీ ఈ సినిమా కోసం  మరింత సన్నబడ్డారు.అలాగే బిచ్చగాడు క్యారెక్టర్ లో ధనుష్ చేసిన పాత్రకి నేను ఫిదా అయిపోయాను.ఇది ఒక పాన్ ఇండియా సినిమా..ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, లవ్,యాక్షన్ ప్రతి ఒక్కటి ఇందులో చూస్తారు. ఇప్పటివరకు ఇలాంటి జానర్లో మీరు సినిమా చూసి ఉండరు. ఇక రష్మిక గురించి చెప్పుకుంటే.. ఆమె చెత్త కుప్పల్లో కూడా ఈ సినిమా కోసం వర్క్ చేసింది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు చాలా డెడికేషన్ తో వర్క్ చేశారు. వారి డెడికేషన్ కి నేను ఫిదా అయిపోయాను.. అంటూ తాజాగా హైదరాబాద్లో జరిగిన కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శేఖర్ కమ్ముల సినిమా గురించి సినిమాలో నటించిన వారి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: