టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన తర్వాత నుండి చాలా కాలం పాటు తాను దర్శకత్వం వహించిన సినిమాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేస్తూ వచ్చాడు. అలాంటి సమయం లోనే ఈయన బాలకృష్ణ హీరోగా అఖండ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని కూడా తెలుగులో మాత్రమే విడుదల అయింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. అలా ఈ సినిమా సూపర్ గా సక్సెస్ అయిన వేల ఈ సినిమాను హిందీ లో కూడా విడుదల చేసి ఉంటే బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి ఉండేది అని అనేక మంది అభిప్రాయ పడ్డారు.

ఇకపోతే అఖండ మూవీ తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా స్కంద అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇతర భాష ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం బోయపాటి శ్రీను , బాలకృష్ణ హీరోగా అఖండ 2 రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే అఖండ 2 మూవీ ని తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. దానితో అనేక మంది స్కంద మూవీ తో బోయపాటి హిందీ టార్గెట్ మిస్ అయింది. ఇప్పుడు బాలయ్య ఉన్నాడు. కచ్చితంగా అఖండ 2 మూవీ హిందీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది అనే అభిప్రాయాన్ని బాలకృష్ణ ఫాన్స్ వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: