
సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ క్యారెక్టర్ ని చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని చూపించారు. పుష్ప లో అల్లు అర్జున్ చేసిన యాక్షన్స్ సన్నివేశాలను మహేష్ బాబు ఫేస్ ను పెట్టి మరి క్రియేట్ చేశారు ఏఐ తో. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మహేష్ బాబు కంటే అల్లు అర్జున్ కి బాగా సెట్ అయ్యిందని మరి కొంతమంది ఈ వీడియో క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నాయని తెలుపుతున్నారు అభిమానులు.
పుష్ప చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా ఈ సినిమా భారీ కలక్షన్ రాబట్టింది. తెలుగు సినీ పరిశ్రమను మరొక స్థాయికి తీసుకువెళ్లిన చిత్రంగా నిలిచింది పుష్ప, పుష్ప2. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలోని పాత్ర కీ సంబంధించి ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి పుష్ప రాజ్ గా చేసిన మహేష్ వీడియో ఒకసారి చూసేయండి.