ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఇది ఒక ట్రెండ్ లా మారిపోయింది . కొంతమంది హీరోయిన్స్ పెళ్లి కాకుండానే బిడ్డలని కనేస్తున్నారు . అది ఎంత తప్పో.. ఎంత పెద్ద అపచారం అనేది అందరికీ తెలిసిందే.  అసలు మన హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి కాకుండా బిడ్డలు అనేది అది ఒక నేరం . కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు . పెళ్లి కాకుండానే బిడ్డలు కనేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఓ హీరోయిన్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాని చెక్ చేసి పడేసింది . అది కూడా ఒక బిగ్ స్టార్ హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంట్రా అనే జనాలు మాట్లాడుకునేలా చేసింది . ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ "ఇలియానా".


ఇలియానాకి  ఇండస్ట్రీలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకో అక్కర్లేదు . పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్  చేసుకొని ఇండస్ట్రీని అల్లాడించేసింది . ఆ తర్వాత ఆమె తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ ఆమెని పాతాళానికి పడిపోయేలా చేసింది.  ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఇలియానా తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది అన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఇలియానా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు . పెళ్లి కాకుండానే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకి కూడానా..? ఇదేంది..? ఇదేం దారుణం అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు.



ఇలియానా 2023లోనే మైకేల్ డోలన్ అనే విదేశీయుడుతో ఓ కొడుక్కి జన్మనిచ్చింది.  ఆమె కొంతకాలంగా అతనితో డేటింగ్ లో ఉండింది . కానీ ఆ విషయం బయటపెట్టలేదు.  కొడుకు పుట్టాక విషయాన్ని బయటపెట్టింది . గత ఏడది అక్టోబర్లో తాను రెండోసారి ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఇలియానా..తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా భర్త డోలన్ రోజులు ఉన్న బిడ్డ ఫోటోని పోస్ట్ చేసింది . "బెస్ట్ డాడీ " అని చెప్పుకొచ్చింది . ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఆమె ఫోటో వైరల్ అవుతుంది. ఇలియానా రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చేసిందా..? ఇదేంటి పెళ్లి కాకుండానే వీళ్ళు ఇలా బిడ్డలు కనేస్తున్నారు..? అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే .. మరి కొంత మంది ఎవర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుందో..?? ఇలా పెళ్లి కాకుండానే బిడ్డలని కంటుంది..?? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలియానా షేర్ చేసింది రెండో బిడ్డ ఫోటో నా..? లేకపోతే మొదటి బిడ్డ ఫోటో నేనా..? అనేది తెలియాల్సి ఉంది . ఇప్పటివరకు ఇలియానా తన రెండో బిడ్డ గురించి ఎక్కడ రివిల్ చేయకపోవడం గమనార్హం . త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్తుందేమో వెయిట్ చేయాలి..!??

మరింత సమాచారం తెలుసుకోండి: