టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య కొంత కాలం క్రితం తండెల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు , అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. చైతూ కెరియర్లో భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా నటుడిగా చైతన్య కు మంచి గుర్తింపును కూడా తీసుకువచ్చింది. ప్రస్తుతం చైతన్య , కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. విరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే చైతూ తన తదుపరి మూవీ కి కూడా డైరెక్టర్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చైతన్య తన తదుపరి మూవీ ని శివ నిర్మాణ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైతూ , శివ కాంబోలో మజిలీ అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటించింది. ఇకపోతే మజిలీ సినిమా తర్వాత శివ దర్శకత్వంలో రూపొందిన టచ్ జగదీష్ సినిమా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి పెద్ద స్థాయి రెస్పాన్స్ దక్కలేదు. ఆ తర్వాత ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా ఖుషి అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి చైతన్యతో తీయబోయే సినిమాతో శివ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: