
ఈసినిమా మీద 200 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టడం వెనుక ప్రభాస్ కలెక్షన్స్ స్టామినా పై ఉన్న నమ్మకం అనే విషయంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. దీనికితోడు జాతీయ స్థాయిలో ప్రభాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈసినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అన్న అంచనాలతో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో ప్రభాస్ ఎంత సేపు కనిపిస్తాడు అన్న ఆశక్తి అభిమానులలో ఉంది.
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ చేసిన రుద్ర పాత్ర ఈమూవీలో అరగంట వరకు ఉంటుందని లీకులు వస్తున్నాయి. రచయిత బీ వీ ఎస్ రవి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ కొన్ని ఆశక్తికర విషయాలు లీక్ చేశాడు. ప్రభాస్ పాత్ర ఈమూవీ సెకండ్ హాఫ్ ఉంటుందని చెపుతూ ఇంటర్వెల్ తర్వాత సరిగ్గా 15వ నిమిషంలో ప్రభాస్ పాత్ర సినిమాలోకి ప్రవేశిస్తుందని అక్కడ్నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెపుతూ ప్రభాస్ విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాడు.
అంతేకాదు ‘కన్నప్ప’ చరిత్ర సృష్టించిన సినిమా అవుతుందని బీవీఎస్ రవి చెపుతున్నాడు. ఇదే సంధర్భంలో ఈమూవీలో విష్ణు ‘కన్నప్ప’ కోసం ప్రాణం పెట్టి నటించాడని అలాగే డబ్బింగ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాడని చెపుతూ తెలుగులో చిన్న తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్ గా డైలాగులు చెప్పాడని అంటూ అతడి కష్టానికి ‘కన్నప్ప’ మంచి ఫలితాన్ని అందిస్తుందని తన నమ్మకం అని రవి అంటున్నాడు..