- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత కుబేర సినిమా థియేటర్లకు మంచి ఊపిరి ఊదింది. కుబేర సినిమాకు తొలి రోజు తొలి ఆట నుంచి సూపర్ హిట్ రావడంతో చాలా రోజుల తర్వాత థియేటర్లలో హౌస్ ఫుల్ కనిపించాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున .. కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోలుగా , రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మన తెలుగు ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న ఏసియన్ సునీల్ , పుస్కూర్ రామ్మోహన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్మెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తుందని .. ఇక్కడికి తాను గెస్ట్ గా రాలేదు .. మీలో ఒకడి గా .. మీ ఆత్మీయుడుగా వచ్చానని చెప్పారు.


ఈ క్రమంలోనే తన తోటి హీరో నాగార్జున గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చిరంజీవి కుబేర సక్సెస్ వేదికగా బయటపెట్టారు. తనకు తెలిసి నాగార్జున ఎప్పుడు ఎవరి కాళ్లకు నమస్కారం పెట్టరు అని .. ఏసియ‌న్ సునీల్‌ను చూపిస్తూ సునీల్ మీ తండ్రి గారు అయిన నారాయణదాస్‌ నారంగ్ కాళ్ళకు మాత్రమే నాగార్జున నమస్కారం చేయటం తాను చూసానని చిరంజీవి తెలిపారు. ఇక నాగార్జున ఇండస్ట్రీలో ఎవరిని అయినా పేరు పెట్టి పిలవటం లేదా ఏకవచనంతో పిలుస్తూ ఉంటారు. చివరకు తన సొంత అన్న అక్కినేని వెంకట్ ను కూడా ఏరా వెంకట్ అని పిలుస్తూ ఉంటారంట. అయితే ఒక నందమూరి హరికృష్ణ మాత్రం సీతారామరాజు సినిమా చేసినప్పటి నుంచి అన్నయ్య అని ప్రేమగా పిలుస్తానని నాగార్జున గతంలోనే చెప్పారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: