సినిమా ఇండస్ట్రీ లో ఒక ఫార్మాట్లో ఓ మూవీ వచ్చి అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే అదే ఫార్మేట్లో మరికొన్ని సినిమాలు రావడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సినిమాల్లో ఇద్దరు హీరోలు కనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఇద్దరు మెయిన్ హీరోలుగా కాకుండా ఒక హీరో మెయిన్ గా కనిపిస్తే మరో హీరో చిన్న క్యామియో పాత్రలో కనిపించడం , ఆయన ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి చాలా ఇంపాక్ట్ ను చూపించడం జరిగిన సినిమాలు అనేకం ఉన్నాయి.

కొంత కాలం క్రితం చిరంజీవి "వాల్టేరు వీరయ్య" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ ఫ్లాష్ బ్యాక్ లో వస్తాడు. ఆ సినిమా అప్పటివరకు వెళ్లిన తీరుతో పోలిస్తే రవితేజ వచ్చాక సూపర్ జోష్ లో వెళుతుంది. దానితో రవితేజమూవీ కి అత్యంత ప్లేస్ అయ్యాడు. దానితో ఆ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విషయంలో అనిల్ "వాల్టేరు వీరయ్య" ఫార్ములా ను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

చిరు హీరోగా అనిల్ రూపొందిస్తున్న మూవీ లో కూడా ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతున్నట్లు , అందులో వెంకటేష్ క్యామియో పాత్రలో కనిపించనున్నట్లు , ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిరు గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక చిరు వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ తో స్క్రీన్ షేర్ చేసుకొని అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో చిరు , వెంకీ తో స్క్రీన్ షేర్ చేసుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: