- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అందరూ మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ పోషించడానికి కూడా ఆలోచించడం లేదు. ఇండస్ట్రీ ట్రెండుకు తగినట్టు వాళ్ళు మారిపోతున్నారు. ఈ విషయంలో నాగార్జున - వెంకటేష్ ఎప్పటినుంచో ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల చిరంజీవి కూడా అందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. తోటి స్టార్ హీరోల సినిమాలలో తాను సైతం కీలకపాత్రలో పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ విషయంలో నాగార్జున తనని ఎంతో ఇన్స్పైర్ చేశారని చిరంజీవి తెలిపారు. ఇక ఓటిటీ సిరీస్ లో కూడా చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అని తెలిపారు. ఇక బాలయ్య కూడా స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రూల్స్ ఆఫర్ చేస్తే నో చెప్పే అవకాశం లేదు. చిరంజీవితో కలిసి నటించటానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపించేశారు.


ఆ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తే ఆయన నోట నో అనే మాటరాదు. కానీ బాలయ్య నుంచి ఓ క్లారిటీ రావాలి. ఇంతవరకు ఆయన ఓటీటి సిరీస్ ల గురించి స్పందించలేదు. వాటిలో నటించడానికి బాలయ్యకు ఆసక్తి ఉందా లేదా ? అన్నది ఏ సందర్భంలోనూ రివీల్ చేయలేదు. కానీ ఆహా ఓటీటీ వేదికపై అన్‌స్టాప‌బుల్ షో ను మాత్రం బాలయ్య సింగిల్ హ్యాండ్ తో హోస్ట్ చేసి సూపర్ హిట్ చేశారు. ఆ టాక్ షో అంత పెద్ద సక్సెస్ అయిందంటే కారణం బాలయ్య అనడంలో సందేహం లేదు. అలా బాలయ్య వెబ్ సిరీస్ ల్లోకి ఎంట్రీస్తే మామూలుగా ఉండదు. ఇక దర్శకులు ఆయనలోని కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. మిగిలిన ముగ్గురు సీనియర్ స్టార్ల కంటే బాలయ్య ఓటిటీ లో ఇంకా గొప్ప సక్సెస్ సాధించే అవకాశం ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: