అందాల భామ నిధి అగర్వాల్ గురించి పరిచయాలు అక్కర్లేదు. 2017లో బాలీవుడ్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన నిధి అగ‌ర్వాల్‌ను 2018లో `సవ్యసాచి` సినిమాతో నాగ‌చైత‌న్య తెలుగుతెరకు ప‌రిచ‌యం చేశాడు. తొలి సినిమాతోనే తన గ్లామర్ తో యూత్ కు విపరీతంగా కనెక్ట్ అయిన నిధి.. `ఇస్మార్ట్ శంకర్` మూవీ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ కు సైన్ చేయ‌డం వ‌ల్ల 2022 తర్వాత నిధి అగర్వాల్ వెండితెర‌పై కనిపించలేదు.


కానీ ఈ ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అందులో ఒక‌టి `హరి హర వీరమల్లు` పార్ట్ 1 కాగా.. `ది రాజా సాబ్` మరొకటి. హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిధి స్క్రీన్ షేర్ చేసుకుంది. అనేక వాయిదాల అనంత‌రం ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కు జోడిగా రాజా సాబ్ లో నిధి అగర్వాల్ నటించింది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.


సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే నిధి తాజాగా త‌న‌కున్న వింత అలవాటును బయట పెట్టింది. పాపం ఈ బ్యూటీకి రోజు నైట్ మర్డర్ మిస్టరీ సినిమాలు చూస్తేగానీ నిద్ర పట్టట్లేద‌ట‌. `గైస్.. నేను ప్రతి రాత్రి ఒక మర్డర్ మిస్టరీ చూడాలని ఉంది. ప్ర‌స్తుతం నాకు కొత్త కంటెంట్ దొరకడం లేదు.. దయచేసి నాకు కొన్ని సూచనలు ఇవ్వండి.. ఏ భాష అయినా ప‌ర్వాలేదు చూస్తాను` అంటూ నిధి పోస్ట్ పెట్టింది. దాంతో ఫ్యాన్స్ మ‌రియు నెటిజ‌న్లు దొరికిందే ఛాన్స్ అన్న‌ట్లుగా మర్డర్ మిస్టరీ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా పేర్ల‌తో ఆమె కామెంట్ సెక్ష‌న్ ను నింపేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: