
సుమారుగా 18 ఏళ్ల పాటు పలు రకాల టీవీ చానల్స్ లో యాంకర్ గా చేసిన స్వేచ్ఛ మొదటిసారిగా టీవీ9 ఛానల్ లో పనిచేసేది. ఆ తర్వాత TUWJ సెక్రటరీగా కూడా పనిచేసింది. కానీ తాజాగా ఈ యాంకర్ చనిపోవడంతో ఆమె స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు, తోటి యాంకర్స్ ఆశ్చర్యపోయారు. కానీ ఈ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వేచ్ఛ 13 ఏళ్ల కలిగిన కూతురు కలిగి ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని విభేదాల వల్ల మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన స్వేచ్ఛ ఆ తర్వాత T న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణచందర్ తో సహజీవనం చేసిందని సమాచారం.
కానీ కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో కొంతమేరకు దూరంగా ఉన్నారని ఈ నేపద్యంలోనే స్వేచ్ఛ ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియదు కానీ మొత్తానికి స్వేచ్ఛ ఆత్మహత్య మరణం కుటుంబ సభ్యులను కూడా ఆశ్చర్యపరుస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధికారులు స్వేచ్ఛ ఆత్మహత్య మరణం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం పై నిజాలు బయటపెడతారేమో చూడాలి మరి. మరి ఈ యాంకర్ మరణం వెనక ఏం జరిగింది చూడాలి.