
ఇదే క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తో కలిసి ఛలో సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టింది .. అలా మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో మంచి విజయం అందుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది .. ఆ తర్వాత ఈ భామ వరుస సినిమాలో నటిస్తూ మెప్పిస్తుంది .. తెలుగులో గీతాగోవిందం , భీష్మ, పుష్ప ,యానిమల్ , పుష్ప2 , సికిందర్, చావా వంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్ లోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది .. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ తన వ్యక్తిగత , వ్యాపార విషయాలను కూడా తన అభిమానాలతో ఎప్పుడు పంచుకుంటూనే ఉంటుంది ..
అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈ బ్యూటీ కుబేర సినిమా తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది ..అయితే ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది .. ఓ ప్రియమైన డైరీ .. నేను ఒక రోజు లండన్ లో ఉన్నాను నన్ను నమ్మండి నేను చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు .. కానీ నేను మిమ్మల్ని దాని ద్వారా తీసుకెళ్తాను .. అంటూ సోషల్ మీడియా లో ఫోటోలు పంచుకొని క్యాప్షన్ ఇచ్చింది .. ప్రస్తుతం రష్మిక పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది ..
View this post on InstagramA post shared by rashmika mandanna (@rashmika_mandanna)