ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో ప్రియమణి ఒకరు. ఈమె ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాలలో కూడా నటించింది. జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఈ మూవీ తో మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈమె క్రేజ్ తెలుగులో భారీగా పెరిగిపోయింది.

ఆ తర్వాత ఈమె  వరుస పెట్టి అనేక తెలుగు సినిమాల్లో నటించి చాలా కాలం పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్గా తెలుగులో కెరియర్ను కొనసాగించింది. ఈమె ఇప్పటికే పలు హిందీ సినిమాలలో కూడా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణి , రేవతి దర్శకత్వంలో రూపొందిన ది గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ రోజు నుండి అనగా జులై 4 వ తేదీ నుండి జియో హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ అమెరికాలో వచ్చిన ది గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ కి కాపీ అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రియమణి ఈ వార్తలపై గట్టిగా స్పందించింది. తాజాగా ప్రియమణి స్పందిస్తూ ది గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ ఏ వెబ్ సిరీస్ కి కాపీగా రూపొందించలేదు. ఇది మా సొంత కథతో రూపొందించాం. ఇది ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చింది. మరి ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ది గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: