ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో నయనతార ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించింది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే మంచి విజయాలను అందుకుంది. దానితో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా తమిళ సినిమాల్లో నటించడంపై అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది.

ఇక ఈ మధ్య కాలంలో కూడా నయనతార ఎక్కువ శాతం తమిళ సినిమాల్లోనే నటిస్తోంది. నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న  సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ కానుకగా విడుదల చేయనున్నారు. గతంలో నయనతార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఓ సినిమా చేసి చాలా తప్పు చేశాను ... ఆ మూవీ మంచి విజయం సాధించిన నాకు సంతోషాన్ని కలిగించలేదు అని చెప్పుకొచ్చింది.

నయనతార కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం గజిని అనే సినిమాలో నటించాను. ఆ మూవీ పెద్ద హిట్ అయిన నాకు పెద్దగా సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సినిమాలో నా పాత్ర నిడివి చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. కానీ వారు మొదట చెప్పినంతగా ఆ సినిమాలో నా పాత్ర లేదు. అలాగే అనేక విషయాలలో ఆ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది అని నయనతార చెప్పుకొచ్చింది. గజిని మూవీ లో సూర్య హీరోగా నటించగా ... ఆసిన్ హీరోయిన్గా నటించింది. ఏ ఆర్ మురగదాస్ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: