
బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి డైరెక్షన్లో వస్తున్న రామాయణ మూవీలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్ గానే రామాయణ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు.ఇక ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి.. ఆంజనేయుడు పాత్రలో సన్నీడియోల్ .. రావణుడిగా యష్,మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఎప్పుడైతే రామాయణ మూవీలో నటిస్తున్న కొంతమంది ఆర్టిస్టుల పాత్రలను రివీల్ చేశారో అప్పటినుండి సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ పై ట్రోలింగ్ జరుగుతుంది. అదే సాయి పల్లవి.. సాయి పల్లవి సీత పాత్రలో చేస్తోంది.రావణుడి భార్య మందోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.కాజల్ సాయి పల్లవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ రావణుడు చందమామ లాంటి కాజల్ అగర్వాల్ ని వదిలేసి సాయి పల్లవి దగ్గరికి వెళ్తారా అంటూ సాయి పల్లవిని హేళనగా చేస్తూ మాట్లాడుతున్నారు.