టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ `సింహాద్రి`. దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమిది. భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. నాజర్, భానుచందర్, శరత్ సక్సేనా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 2023 జూలై 9న విడుదలైన సింహాద్రి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సింహాద్రి సింహగర్జనకు నేటితో 22 ఏళ్లు.


విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ రాశారు. నిజానికి ఎన్టీఆర్ బాబాయ్ అయిన బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లో రావాల్సిన‌ సినిమా ఇది. కానీ అనుకోని కారణాలతో మిస్ అయింది. దాదాపు రూ. 8.5 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సింహాద్రి చిత్రం.. రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దూకింది. అయితే తొలి ఆట నుంచి సింహాద్రి సినిమాకు సూపర్ హిట్ టాక్ లభించింది.


దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చెల‌రేగిపోయింది. అప్ప‌ట్లో సింహాద్రి క‌లెక్ష‌న్స్ చూస్తే క‌ళ్లు చెద‌రాల్సిందే. ఫుల్ ర‌న్ లో ఏకంగా ఈ మూవీ రూ. 26.50 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే సింహాద్రి 52 డైరెక్ట్ సెంటర్స్ లో 175 రోజులు ఆడింది. ఈ రికార్డును ఇంతవరకు మరే సినిమా బ్రేక్ చేయలేకపోవడం గ‌మ‌నార్హం. అదేవిధంగా 2023లో ఎన్టీఆర్ 40 వ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రిని రీరిలీజ్ చేశారు. ఆ టైమ్‌లో  రూ.2.83 కోట్ల షేర్, రూ.4.56 కోట్లు కలెక్ట్ చేసి అంద‌రి చేత ఔరా అనిపించింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: