మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని ఈ సంవత్సరం ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే మేకర్స్ ఒక సాంగ్ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. రవితేజ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ సరసన చాలా మంది హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు , అందుకు అనుగుణంగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కిషోర్ తిరుమల సినిమా తర్వాత రవితేజ , కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. కళ్యాణ్ శంకర్ వరుసగా మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్  మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కూడా ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలుగా వచ్చాయి. దానితో రవితేజతో కూడా ఈయన అలాంటి జోనర్ మూవీనే చేస్తాడు అని చాలా మంది భావించారు. కానీ కళ్యాణ్ శంకర్ , రవితేజ తో కామెడీ ఎంటర్టైనర్ కాకుండా సరికొత్త జోనర్ మూవీని చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజతో కళ్యాణ్ శంకర్ భారీ బడ్జెట్ తో సోసియో ఫాంటసీ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ తన కెరియర్లో దరువు సినిమా తర్వాత సోషియ ఫాంటసీ మూవీలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశం నిర్మించబోతున్నాడు. ఈయన బ్యానర్ లో కూడా ఇదే మొదటి సోషల్ ఫాంటసీ సినిమా అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని నాగ వంశీ ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: