కృతి శెట్టి - శ్రీ లీల ఇద్దరు కూడా ఓకే  ఏజ్ కి సంబంధించిన వాళ్ళు . ఇంచుమించు ఇండస్ట్రీలో ఒకే మూమెంట్ లో అడుగుపెట్టారు . కానీ కృతి శెట్టి అంటే ఫ్లాప్ హీరోయిన్ అని శ్రీలీల అంటే స్టార్ హీరోయిన్ అని ఓ రేంజ్ లో టాక్ వినిపిస్తుంది.  దానికి కారణం కృతిశెట్టి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకోవడమే . శ్రీలీల మాత్రం  తన ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వేసుకొని ఓ రేంజ్ లో అల్లాడించేసింది . అఫ్కోర్స్ ఇప్పుడు శ్రీలీల ఖాతాలో కూడా ఫ్లాప్స్ పడుతున్నాయి .


బ్యాక్ టు బ్యాక్ ఆమె కమిట్ అయిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి . కానీ శ్రీ లీల ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . ఆమె క్రేజ్ .. పాపులారిటీ .. రేంజ్ అన్ని రోజురోజుకి డబల్  అయిపోతున్నాయి . అయితే అదే ఫ్లాప్ టాక్ అందుకున్న కృతి శెట్టి కెరియర్ మాత్రం పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోయింది . తెలుగులో ఛాన్స్ ఇవ్వడం లేదు డైరెక్టర్స్. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది .



కృతి శెట్టి కూడా శ్రీలీల చేసి ఉంటే ఇప్పుడు ఆమెకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటున్నారు జనాలు.  శ్రీ లీల సినిమాలలో అవకాశాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియా ద్వారా నిరంతరం యాక్టివ్ గా ఉంటూ వచ్చేది . మరి ముఖ్యంగా పలు సినిమాలకి సపోర్ట్ చేస్తూ పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ 24 గంటలు కూడా ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపించేలా ఏదో ఒక విధంగా గుర్తింపు సంపాదించుకునేది. కానీ కృతి శెట్టి మాత్రం తన సినిమాల విషయంలో పూర్తిగా రాంగ్ స్టెప్ వేసింది.  తన బాడీకి సూట్ అవ్వని రోల్స్  చూస్ చేసుకోవడమే కాకుండా కంటెంట్ లేని సినిమాలను కూడా చూస్ చేసుకోవడం ఆమెకి నెగిటివ్ గా మారింది . దానికి తగ్గట్టే కృతి శెట్టి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తుంటుంది  కానీ మిగతా స్టార్స్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేయదు.. ఎవరైనా స్టార్స్ పుట్టినరోజు అయితే విష్ చేయదు . దీంతో ఆమె పేరు ఎక్కువగా వినిపించేది కాదు . ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అది ఉందంటే ఉంది అనే విధంగానే ఉండేది . శ్రీలీల మాత్రం తన ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో పెంచేసుకునేస్తుంది. ఈ కారణంగానే శ్రీలీల పేరు మారుమ్రోగిపోతుంది అని చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: