సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం కూలీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నాగార్జునమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పూజ హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఉపేంద్ర , శృతి హాసన్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక రజనీ కాంత్ "కూలీ" సినిమాతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడంతో జైలర్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మూవీ లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొంత మంది అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీ నటులు కూడా ఈ మూవీ లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రజిని తన నెక్స్ట్ మూవీ కి దర్శకుడుని కన్ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం విజయ్ సేతుపతి హీరోగా మహారాజా అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు.

మూవీ సూపర్ సక్సెస్ కావడంతో దర్శకుడిగా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ రజనీ కాంత్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ దర్శకుడు రజనీ కాంత్ ను కలిసినట్లు , అందులో భాగంగా రజనీ కాంత్ కు ఒక కథను వినిపించినట్లు తెలుస్తోంది. ఆ కథ బాగా నచ్చడంతో ఈ దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: