
ఈ సినిమా సోషియో ఫ్యాంటసి చిత్రంగా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ . ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది . కాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండబోతుంది అని అది మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అన్నయ్య మూవీలోని "ఆట కావాలా పాట కావాలా" అనే పాట అంటూ ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ట్రెండ్ అయింది . అయితే తాజాగా ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మనస్సు మార్చుకున్నారట . తన సూపర్ డూపర్ హిట్ సినిమా "ఖైదీ" చిత్రంలోని "రగులుతుంది మొగలి పొద" అనే సాంగ్ ని నేటి జనరేషన్ కి తగ్గట్టు రీమేక్ చేసి ఆ స్టైల్ లో కంపోజ్ చేసి ఈ సినిమాలో రిలీజ్ చేయబోతున్నారట.
ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ మెగాస్టార్ తో కలిసి చిందులు వేయబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అంతేకాదు ఈ పాటలో మౌని రాయ్ అందాల విందు అభిమానులను కట్టిపడేస్తుంది అంటూ కూడా ఇన్సైడ్ లో మేకర్స్ మాట్లాడుకుంటున్నారట . ఈ పాటను భీమ్స్ సిసి రోలియ కంపోజ్ చేయనున్నాడట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఆట కావాలా పాట కావాలా సాంగ్ బాగుంటుంది కానీ దానికంటే రగులుతుంది మొగలి పొద సాంగ్ ఇంకా బాగుంటుంది అది కూడా మౌని రాయి - చిరంజీవి ఇక కేక అంటూ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???