
గాలి జనార్ధన రెడ్డి తనయుడు గాలి కిరీటి ఈ సినిమాతో హీరోగా ఒకేసారి అటు కన్నడలోకి ఇటు తెలుగులోకి లాంచ్ అవుతున్నాడు. శ్రీలీల హీరోయిన్ కాగా.. జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. జూలై 18న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. సినిమా విషయాలతో పాటు మరెన్నో ఆసక్తికర విశేషాలు కూడా పంచుకుంది. జూనియర్ స్టోరీ మూడేళ్ల క్రితం తన వద్దకు వచ్చిందని.. కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని జెనీలియా తెలిపింది. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ సీరియస్ గా ఉన్న కూడా బలమైన భావోద్వేగాలతో సాగుతుందని ఆమె పేర్కొంది.
అలాగే `బొమ్మరిల్లు`లో హాసిని, `హ్యాపీ` మూవీలో మధుమతి పాత్రలు చాలా మెమొరబుల్ గా మిగిలిపోయాయని.. ఇప్పటికీ ఆడియన్స్ ఆ పేర్లతోనే తనను పిలుస్తుంటారని.. ఒక నటికి అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని జనీలియా తెలిపింది. అదేవిధంగా ఇకపై తాను ప్రాధాన్యత ఉన్న పాత్రలకే సంతకం చేస్తానని.. ఆ తరహా పాత్రలు చేయమని అవకాశం వస్తే ఆడిషన్ ఇవ్వడానికి కూడా తాను రెడీ అని జెనీలియా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.