టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈశ్వర్ అనే మూవీతో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా మంచు విష్ణు "కన్నప్ప" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ మూవీలో ప్రభాస్ చిన్న పాత్రలో నటించడంతో ఈ మూవీ పై కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం విడుదల అయినా కన్నప్ప పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ , హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పౌజి అనే సినిమాలలో నటిస్తున్నాడు. ప్రభాస్ ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా వదిలేసిన సినిమాలలో ఓ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ కూడా అయినట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ వదిలేసిన ఆ సినిమా ఏది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరోగా త్రిష హీరోయిన్గా ప్రభుదేవా దర్శకత్వంలో నువ్వోస్తానంటే నేనొద్దంటానా అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయి రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా ఈ మూవీ తొమ్మిది భాషల్లో రీమేక్ కూడా అయ్యింది. ఈ మూవీ కథను తయారు చేసుకున్న తర్వాత ప్రభుదేవా ఈ సినిమాలో సిద్ధార్థ్ ను కాకుండా ప్రభాస్ ను హీరోగా అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలసి కథను కూడా వివరించాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ప్రభాస్ ఆ సినిమాలో నటించడానికి అంగీకరించలేదట. ఆ తర్వాత సిద్ధార్థ్ కి ఈ మూవీ కథల వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి ఓకే అన్నాడట. దానితో దానితో సిద్ధార్థ్ హీరోగా ప్రభుదేవా "నువ్వోస్తానంటే నేనొద్దంటానా" మూవీ ని రూపొందించాడట. ఇలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీతో సిద్ధార్థ్ కి భారీ విజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: