
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా 'హరిహర వీరమల్లు 'ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూపులు చూస్తున్నారు. నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 10 సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది . మరో5 రోజుల్లో దియేటర్లలో పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా తో తన వేట కొనసాగించనున్నారు. క్రిష్ , జ్యోతి కృష్ణ ఇద్దరు కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను స్టాంప్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఉన్నారు . ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ 'బుక్ మై షో 'లో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నట్టు ఏకంగా 3 లక్షల మంది ఇంట్రెస్ట్ చూపించారు . ఇలా ఓ హిస్టారికల్ సినిమా గా రాబోతున్న' హరిహర వీరమల్లు 'సినిమా కోసం ఇంత మంది ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండటం నిజంగా విశేషం అని చెప్పాలి..
దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ నుంచి రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేమికులు అందరూ ఈ సినిమా కోసం చాలా ఉత్కంఠతో ఉన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ సీనియర్ హీరో బాబి డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు . ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య బ్యానర్ పై ఏం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు