
పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా జులై 24వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారట మహేష్ బాబు . గతంలో జల్సా సినిమాకి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు . సేమ్ అదే విధంగా ఈ సినిమాలో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారట మహేష్ బాబు. మహేష్ బాబు ని తెర చూడలేకపోయినా ఆయన వాయిస్ అయినా వినొచ్చు అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్.
హరిహర వీరమల్లు సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమాని ఏ ఏం రత్నం నిర్మించారు . ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది . చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ ప్రాజెక్టు జూలై 24వ తేదీ రిలీజ్ అవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈసారి ముందుగానే ప్రీమియర్స్ పడబోతున్నాయి . అంటే జులై 23 రాత్రి 9:00 30 నిమిషాలకు ప్రీమియర్స్ పడతాయి అనమాట. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కొన్ని గంటల ముందే థియేటర్స్ లో జాతర వచ్చేస్తోంది అని చెప్పాలి. చూద్దాం మరి ఏపీ డిప్యూటి సీఎం అయిన తరువాత పవన్ నటించి రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా ఇది. ఎలా అభిమానులను ఆకట్టుకుంటుందో...???