హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ ప్రదర్శించడం ఈ సినిమాకు మైనస్ అయిందని చాలామంది భావిస్తారు. అయితే వీరమల్లు రిజల్ట్ చూసి కూడా కింగ్డమ్ కు ప్రీమియర్లు వేయడం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగవంశీ నిర్ణయం రైటేనా? అనే చర్చ సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

కింగ్డమ్ సినిమాకు  మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయల పెంపు లభించింది.  ఈ టికెట్ రేట్లతోనే కింగ్డమ్ మూవీ ప్రీమియర్స్ సైతం ప్రదర్శితం కానున్నాయని తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. కింగ్డమ్ మూవీ సైతం  రెండు భాగాలుగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  కింగ్డమ్ సినిమా ఏకంగా 130 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

ఈ బడ్జెట్ రికవరీ కావాలంటే టికెట్ రేట్ల పెంపు అవసరం కావడంతో మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది.  కింగ్డమ్ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే  బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలను సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయి. నిర్మాత నాగవంశీ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

మరోవైపు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. విజయ్ దేవరకొండ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను మిగిల్చాయి.  ఆ సినిమాల ప్రభావం  విజయ్ దేవరకొండ కెరీర్ పై కూడా పడింది  విజయ్ దేవరకొండ పారితోషికం ప్రస్తుతం 20 కోట్ల రూపాయల  రేంజ్ లో ఉంది. కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సితార బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: