షీలా కౌర్ చెన్నైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 20 సినిమాల వరకు చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా టర్న్ చేస్తుంది. తెలుగులో షీలా తొలి చిత్రం `సీతాకోక చిలుక`. నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రం 2006లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్న షీలా మాత్రం తన అందం, అభినయంతో ఆకట్టుకుని అవకాశాలు అందిపుచ్చుకుంది.
2007లో `రాజు భాయ్`, `హలో ప్రేమిస్తారా` వంటి చిత్రాల్లో మెరిసింది. 2008లో `పరుగు`, 2009లో రామ్ పోతినేనితో కలిసి `మస్కా`, 2010లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా `అదుర్స్` మూవీలో షీలా యాక్ట్ చేసింది. అటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పని చేసింది. 2011లో ఏమైందో ఏమో సడెన్‌గా షీలా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. చివరిగా `పరమ వీర చక్ర` మూవీలో కనిపించింది.ఆ తర్వాత ఆమె నుంచి మరొక సినిమా రాలేదు. ఇకపోతే 2020లో కేరళకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని షీలా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కూతురు కూడా జన్మించింది. చైన్నైలో స్థిరపడిన షీలా ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. తరచూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటోంది. అయితే నాలుగు పదుల వయసుకు చేరవవుతున్న షీలా అందం మాత్రం చెక్కు చెదరలేదు. ఇంకా అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ నేటి తరం హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. షీలా తాజా ఫోటోలు చూసి నెటిజన్లు స్టన్ అయిపోతున్నారు. షీలా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి