
అయితే హీరోయిన్ నయనతార తన కెరియర్లో చేయాల్సిన స్పెషల్ సాంగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్నాయి . నయనతార ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . ఇప్పటికి ఆ స్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంది . నయనతార తన కెరియర్ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించాల్సింది . అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీలోనే. కానీ ఆమె ఐటెం సాంగ్ చేయడం ఇష్టం లేక వదిలేసింది. ఆ పాట మరేంటో కాదు "అనుష్క శెట్టి - చిరంజీవి" కాంబోలో వచ్చిన "స్పైడర్ మ్యాన్".
స్టాలిన్ మూవీలో అనుష్క స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది . ఈ సాంగ్లో ముందుగా నయనతారని అనుకున్నారట . ఆమె మాత్రం ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఒప్పుకోలేదట. రిజెక్ట్ చేసిందట. ఇక ఆ తరువాత చాలా మందిని అప్రోచ్ అయిన ఫైనల్లీ అనుష్క సెలెక్ట్ అయ్యింది. ఆ తర్వాత నయనతార - చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకొని ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుందో అందరికి తెలుసు. ఇప్పుడు మరొకసారి మెగా 157 సినిమాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు తెరకెక్కిస్తూ ఉండడం ఇంకా ఇంకా ప్లస్ పాయింట్. రీసెంట్ గానే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి వెంటనే మెగాస్టార్ చిరంజీవితో సినిమాను ఓకే చేసి ఆల్మోస్ట్ 50% షూటింగ్ కంప్లీట్ చేయడం గమనార్హం..!