పల్లవి ప్రశాంత్..ఈ పేరు కంటే ఎక్కువగా రైతుబిడ్డ అనే ట్యాగ్ తోనే ఈయన ఫేమస్ అయ్యారు.బిగ్ బాస్ 7 లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుంది అని అనూహ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి పంపించారు. అయితే ముందు నుండి అందరితో ఎక్కువగా కలవలేక పోయారు. దానికి కారణం వారు మాట్లాడుకునే మాటలు పల్లవి ప్రశాంత్ కి ఎక్కువగా అర్థమయ్యేవి కావు.అలాగే ప్రతిసారి ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు. కానీ హీరో శివాజీ, యావర్ ఆయనతో ఫ్రెండ్లీగా కలిసిపోయారు. రతిక కూడా మధ్య మధ్యలో పులిహోర కలిపినప్పటికీ రతికగా నిజ స్వరూపం తెలిసి ఆమెను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఏకంగా అక్కా అంటూ సంబోధించడం అందరిని షాకింగ్ కి గురిచేసింది. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ టైటిల్ గెల్చుకోవడంతో ఎంతోమంది సామాన్యులు సంతోషపడ్డారు.


ఒకవేళ పల్లవి ప్రశాంత్ కి కాకుండా అమర్దీప్ కి టైటిల్ ఇస్తే కనుక బిగ్ బాస్ యాజమాన్యంపై కూడా పెద్ద ఎత్తున గొడవకు దిగే వారు కావచ్చు సామాన్య ప్రజలు, రైతు బిడ్డ అభిమానులు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ సెలబ్రిటీలకు దీటుగా పెర్ఫార్మన్స్ ఇచ్చి తన ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా తనతో ఉన్న కంటెస్టెంట్లు కూడా బయటికి వెళ్లాక పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడం గమనార్హం.అలా బిగ్ బాస్ 7 ఉన్నన్ని రోజులు అమర్దీప్ అభిమానులకి పల్లవి ప్రశాంత్ అభిమానులకి సోషల్ మీడియా వార్ జరిగింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ టైటిల్ గెలిచాక అన్నపూర్ణ స్టూడియో వద్ద అమర్దీప్, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది.

 ఈ గొడవలో పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి అమర్దీప్ ని బెదిరించడం కారు అద్దాలు పగలగొట్టడం లాంటివి చేశారు. అలాగే పోలీసులు ర్యాలీ వద్దని చెప్పినా కూడా పల్లవి ప్రశాంత్ తగ్గేదేలే అన్నట్లు విజయోత్సవ ర్యాలీ చేశారు.దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ఆయన తమ్ముడు ఇద్దరు మీద కేసులు పెట్టారు. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చేసారు. అయితే ఈ కేసు కోర్టులో నడుస్తున్న తరుణంలో పల్లవి ప్రశాంత్ తండ్రి కూడా కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఈ విషయాన్ని తలుచుకొని తాజా ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ఇంత బతుకు బతికి మా నాన్నని కోర్టు మెట్లు ఎక్కేలా చేశాను. ఛీ నా బతుకు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆరోజు జరిగిన సంఘటన నాకు గుర్తుకు వచ్చిన ప్రతిసారి కన్నీళ్లు వస్తాయి అంటూ తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: